Adi Srinivas Dance Video: బంజారా సాంగ్స్‌కి స్టెప్పులేసిన ప్రభుత్వ విప్, ఏఎస్పీ.. వీడియో వైరల్..
Adi Srinivas Dance Video: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా కొత్త డైట్ ఆహారం మోనును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సాంగ్స్‌కి స్టెప్పులేశారు.
Adi Srinivas Dance Video: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యూ కమాన్ డైట్ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్ధినిలతో కలసి నృత్యలు చేశారు. బంజార పాటలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో పాటు జిల్లా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి స్టెప్పులు వేశారు. అనంతరం పాఠశాలలోని వంట గది, బియ్యం కూరగాయలను పరిశీలించారు. అలాగే పాఠశాలలో కామన్ డైట్ మెనూలో ఉన్న వివరాలను తెలిపారు. కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సి, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టల్ లలో పోషకాహారం అందించేందుకు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేప్పటారని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలు హాస్టల్స్‌లో సందర్శిస్తున్నారని, గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు మంచి ఆహారం అందించాలనే ఆకాంక్షతో నిపుణులైన డాక్టర్‌ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకాల్లో ఒకే రకమైన డైట్‌ను నేడు ప్రారంభం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో నేడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని, మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా ఆహారం అందిస్తున్నామో.. ప్రజా ప్రభుత్వంలో గురుకులల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పిల్లలు దాగివున్న ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సాహం అందించాలన్నారు.
పాఠశాలలోనే 15 మంది విద్యార్థులకు ఒక గ్రూపుగా తీసుకొని వారి ఏ సబ్జెక్టుల వారీగా రివ్యూలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని, గతంలోనే ఐటీఐ లను ఏటీసీలుగా అప్డేట్ చేయడం జరిగిందని.. త్వరలోనే 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.