Gowdavalli Project Victims: గౌడవెల్లి బాధితులపై లాఠీచార్జ్ ఘటనపై స్పందించిన హెచ్ఆర్సీ.. డీజీపీకి ఆదేశాలు
HRC on Gowdavalli issue: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. బీజేపీ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది కరుణ సాగర్ నేతృత్వంలో నిన్న గౌరవెల్లి బాధితులు ఓ సంఘంగా ఏర్పడి పిటీషన్ దాఖలు చేశారు.
HRC on Gowdavalli issue: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. బీజేపీ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది కరుణ సాగర్ నేతృత్వంలో నిన్న గౌరవెల్లి బాధితులు ఓ సంఘంగా ఏర్పడి పిటీషన్ దాఖలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు స్థానిక పోలీసుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని బాధితులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం.. గౌరవెల్లి లాఠీ ఛార్జ్ ఘటనపై ఆగస్టు 4న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు స్పష్టంచేసింది. ఆలోగా సమగ్ర విచారణ జరిపించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది.
పిటీషనర్లు తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం తమ ఆదేశాల్లో పేర్కొంది.
Also read : Singareni Job Notification 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. సింగరేణిలో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్
Also read : Bhatti Vikramarka: హైదరాబాద్‌లో రణరంగం..భట్టి విక్రమార్క, పోలీసుల మధ్య వాగ్వాదం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook