IGST committee: ఢిల్లీ: ఐజీఎస్టీ ( IGST ) పరిష్కారానికి నియమించిన రాష్ట్రాల మంత్రుల బృందంలో జీఎస్టీ ( GST ) మండలి మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ( central gov t)  ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలకు సంబంధించిన ఏడుగురు సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. అయితే.. ఈ కమిటీలో తెలంగాణ ( Telangana ) ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌ రావు ( T. Harish Rao ) కు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీని నియమించారు. మంత్రి  హరీశ్ రావుతో సహా మిగతా ఆరుగురు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. Also read: TSPSC recruitment: టిఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


ఐజీఎస్టీ పరిష్కారం, సూచనలు, సంబంధిత వ్యవహారాల కోసం 2019 డిసెంబర్‌లో ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో కేంద్ర, రాష్ట్రాల ట్యాక్స్ ఆఫిసర్స్‌ను, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్‌టీ ఇతర భాగస్వాములకు ఈ ఐజీఎస్టీ కమిటీలో చోటు కల్పించేవారు. తాజాగా ఈ కమిటీలో మార్పులు చేస్తూ కేంద్ర జీఎస్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  Also read: COVID-19: అప్పటి వరకు వ్యాక్సిన్‌ ఆశించొద్దు: WHO