Harish rao reacts on trolling over konda surekha: మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్ లో భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. తాను.. నిన్నటి నుంచి  అన్నం తినలేదని, నిద్రకూడా పట్టలేదంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి హోదాలో కొండా సురేఖ వెళ్లారు. అక్కడ ఎంపీ అయిన.. రఘునందన్ రావు.. పూలమాల వేసి మంత్రిగారికి వెల్ కమ్ చెప్పారు. కొంత మంది దీన్ని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దీనిపై మంత్రి చాలా సీరియస్ గా మాట్లాడారు. బీఆర్ఎస్ లో కూడా ఆడవాళ్లు ఉన్నారని, వారికి ఇదే విధంగా ట్రోలింగ్ లు చేస్తే ఊరుకుంటారా.. అంటూ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా.. కేసీఆర్, కేటీఆర్ భార్యలను ఎవరైన ట్రోల్స్ చేస్తే ఎలా ఉంటుందని తన బాధను చెప్పుకున్నారు. బీఆర్ఎస్ గుండాలు గతంలో కూడా మంత్రి సీతక్కను, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ ను కూడా ట్రోల్స్ చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి ఏంచేస్తున్నారో.. వారికే అర్థం కావట్లేదని మండిపడ్డారు.


ఇక మీదట మాత్రం ట్రోలింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు.  ఎంపీసైతం.. తనకు ఫోన్ చేసి.. అక్క లాంటి వారని, సారీ చెప్పారన్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలలో కూడా ట్రోల్ లు చేశారని అన్నారు. మరోవైపు ట్రోలింగ్ లకు పాల్పడిన వ్యక్తి డీపీ హరీష్ రావుది ఉందని, ఆయన తమకు సారీ చెప్పాలని కూడా కొండా సురేఖ డిమాండ్ చేశారు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.



పూర్తి వివరాలు..
 


మంత్రి కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్ లను మాజీ మంత్రి హరిష్ రావు ఖండించారు. అంతేకాకుండా..  మహిళలను గౌరవించడం మనందరి బాధ్యతగా చెప్పిన ఆయన.. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరని తెల్చిచెప్పారు.  ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా తానైనా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. అదే విధంగా ఎక్స్ లో మంత్రి కొండా సురేఖ గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.


Read more: Konda Surekha: నిన్నటి నుంచి అన్నం తినలే.. గాంధీ భవన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న కొండా సురేఖ.. వీడియో ఇదే..


సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అందురు కూడా.. బాధ్యతగా వ్యవహరించాలని అందరిని కోరుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు. మరోవైపు కొండా సురేఖపై ట్రొలింగ్ లపై మంత్రి సీతక్కకూడా స్పందించారు. ఇది హేయమైన చర్యఅని అన్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.