KCR Assembly Session Absent Reasons: ఎన్నికల అనంతరం అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఈ అంశం రాజకీయ వివాదానికి దారి తీస్తోంది. తొలి సమావేశాల్లో ప్రమాణస్వీకారం జరగ్గా.. ఆ సమయంలో కేసీఆర్‌ గాయపడి చికిత్స పొందారు. తాజాగా బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకాకపోవడం వివాదాస్పదమైంది. కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై రేవంత్‌ రెడ్డితోపాటు ఇతరులు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తాజాగా వాటికి పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు సమాధానం ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lok Sabha Elections: సమరానికి సై.. మార్చి  9 తర్వాత ఏ క్షణంలోనైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌


ఓ ఛానల్‌ నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై స్పందించారు. 'కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు. వీళ్లు దాన్ని భూతద్దం పెట్టి చూపిస్తున్నారు. నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్‌ నిలబడి మాట్లాడలేక కూర్చొని మాట్లాడారు. ఇది అందరూ చూశారు' అని గుర్తు చేశారు. కేఆర్‌ఎంబీ అంశంపై నల్లగొండలో ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్‌ కూర్చొని మాట్లాడారు.

Also Read: School Holidays: తెలంగాణలో నాలుగు రోజులు స్కూల్స్‌, ఆఫీసులు బంద్‌.. ఎందుకంటే..?


'అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చా' అని హరీశ్ రావు ఎదురు ప్రశ్నించారు.'అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే సందర్భం ఉంటుందా? ఎప్పుడైనా ఏ నాయకుడైనా కూర్చొని మాట్లాడతరా? మనం స్పీకర్‌ పదవిని గౌరవించాల్సి ఉంటుంది' అని తెలిపారు. అయనా మేం మాట్లాడితే కేసీఆర్‌ మాట్లాడినట్టే కదా అని స్పష్టం చేశారు. మాకు కేసీఆర్‌ ఏది ఆదేశిస్తే.. ఏది చెబితే అది మాట్లాడతామని తెలిపారు. కేసీఆర్‌ మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌ హాజరుకాకపోవడం అంశాన్ని తప్పుబడుతున్నారు.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ అధికారం కోల్పోయారు. కానీ గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కొన్ని రోజులకు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ప్రమాణస్వీకారం సమయంలో కేసీఆర్‌ ప్రమాదానికి గురై శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మొన్న కోలుకున్న కేసీఆర్‌ ప్రత్యేకంగా స్పీకర్‌ చాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ హాజరవుతారని అందరూ భావించగా.. గైర్హాజరయ్యారు. అయితే సమావేశాలు జరుగుతున్న సమయంలోనే నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొనడం విస్మయానికి గురి చేసింది. అసెంబ్లీకి గైర్హాజరు కావడం వెనుక హరీశ్ రావు చెప్పిన కారణాలు వాస్తవంగా తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి