Medaram Holidays In Mulugu District: సాధారణ రోజుల్లో బోసిపోయిన అటవీ ప్రాంతం మేడారం జాతరతో జనారణ్యంగా మారుతుంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న జాతరకు దాదాపు రెండు కోట్లకు పైగా భక్త జనులు తరలిరానున్నారు. జాతర నెల రోజుల ముందు నుంచే మేడారం భక్త జనసందోహంగా మారింది. ఇక జాతర సమయంలో భక్తులతో కిక్కిరిస్తుంది. ఈ సందర్భంగా మేడారం వెళ్లే మార్గాలన్నీ వాహనాలు, భక్తులతో నిండి ఉంటుండడంతో విద్యా శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలతోపాటు కార్యాలయాలు పనిచేయవని ప్రకటించింది.
Also Read: Dengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..
జాతర జరిగే నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ములుగు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, కార్యాలయాలు పని చేయవని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. ఎవరూ కూడా నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా జాతరకు సకల ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.
Also Read: Belgrade Airport: 'పెద్ద రంధ్రం'తోనే గాల్లో ఎగిరిన విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులు
మేడారంలో ఈనెల 21వ తేదీన జాతర మొదలు కానుండగా 24వ తేదీన ముగియనుంది. ఈ నాలుగు రోజులు ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా ములుగు జిల్లాలోనే మకాం వేయనుంది. తాగునీరు, రోడ్లు, పరిశుభ్రత చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి సీతక్క రోజు జాతర ప్రాంగణంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. కాగా అన్ని శాఖలు సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు. జాతర సందర్భంగా ఆర్టీసీ భారీగా బస్సులను అందుబాటులో ఉంచింది. 6 వేల బస్సులను జాతర కోసం ఆర్టీసీ నడుపుతోంది.
కాగా జాతరను ప్లాస్టిక్ రహితంగా అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. జాతరకు వచ్చే భక్తులు సాధ్యమైనంత ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయం వినియోగించాలని చెబుతున్నారు. ఇక ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అమ్మవార్లకు సమర్పించే 'బంగారం' అంటే బెల్లం కొనుగోలు చేయాలంటే ఆధార్‌కార్డు తప్పనిసరి చేశారు. గుడుంబా తయారీని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook