Panjagutta Police Station: సోషల్‌ మీడియాలో పోస్టులపై తెలంగాణ పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావుపై ఇదే కేసు నమోదవడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదవడంపై హరీశ్‌ రావు స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష తప్పుడు కేసులు పెట్టినా సరే ప్రశ్నించడం వదలను అని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Auto Jac Bandh: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. ఆరోజు నగరంలో ఆటోలు బంద్‌


పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుపై మాజీ మంత్రి హరీశ్ రావు 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. 'అడుగడుగునా రేవంత్‌ రెడ్డి చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు.. నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు.. ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక.. సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు' అంటూ హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం' అంటూ మండిపడ్డారు.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ప్రతిపక్షంలో రజినీ.. ఇప్పుడు గజినీ: హరీష్‌ రావు


తనపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నమోదు చేసిన కేసుల చిట్టాను మాజీ మంత్రి హరీశ్ రావు బయటపెట్టారు. 'రుణమాఫీ విషయంలో దేవుళ్లను దగా చేశావని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించావు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించావు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి.. తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించావు' అంటూ కేసుల వివరాలు వెల్లడించారు.


'రేవంత్‌ రెడ్డి రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు.. ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించావు' అని రేవంత్‌ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో.. ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను' అని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.