Harish Rao Went to Tummala Nageshwara rao House: గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రధాన శీర్షికలను ఆకర్షిస్తున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ కి దూరమవుతూ బిజెపికి దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరీష్ రావు ఒక్కరే కాకుండా హరీష్ రావు వెంట సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం సండ్ర వెంకట వీరయ్య, తుమ్మలను ఉద్దేశిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల పేరు ప్రస్తావించకపోయినా ఆయన కామెంట్ చేసింది తుమ్మలనే అని ఖమ్మం రాజకీయాలను ఫాలో అయ్యే వారందరికీ అర్థం అయిపోతుంది.


అయితే దమ్మపేట మండలం గుండుగులపల్లి లో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళుతూ మార్గమధ్యంలో సత్తుపల్లిలో ఉన్న సండ్ర వెంకట వీరయ్యను కూడా కారెక్కించుకుని హరీష్ రావు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సండ చేసిన వ్యాఖ్యలకు ఆయన చేత క్షమాపణలు చెప్పిస్తారేమో అనే విషయం మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాస్తవానికి రేపు కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ సభ పెద్ద ఎత్తున జరుగుతోంది. అదేవిధంగా 18వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడమే గాక మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలుస్తున్నారు.


ఈ సభలోనే బిఆర్ఎస్ విధి విధానాలను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాల్సిందిగా మంత్రి హరీష్ రావు సహా మరికొందరు మంత్రులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సభను విజయవంతం చేయమని కోరేందుకే హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి ఇద్దరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. 


Also Read: Chiranjeevi Vs Balakrishna: 9 సార్లు సంక్రాంతికి బాలయ్య-చిరు పోటీ.. ఎవరెన్ని హిట్లు కొట్టారంటే?


Also Read: Chiranjeevi on Allu Arjun: అల్లు అర్జున్ మెగా టాగ్ మీద చిరు కామెంట్స్.. అవసరమే లేదంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook