Heavy rain in Hyderabad: హైదరాబాద్: సోమవారం సాయంత్రం అనుకోకుండా కురిసిన భారీ వర్షంలో నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాంపల్లి, అబిడ్స్‌తో పాటు పాతబస్తీలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ వర్షానికి గాలి దుమారం కూడా తోడవడంతో అక్కడక్కడ చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం సమయం కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కురిసి, చెట్లు నేలకొరగడం, పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ (GHMC commissioner DS Lokesh Kumar).. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాల్సిందిగా సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.


Also read: Eetela Rajender: కాన్వాయ్, సెక్యురిటీ సిబ్బందిని వెనక్కి పంపించిన ఈటెల రాజేందర్


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కొమరం భీం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల అవర్తనం కారణంగా రాగల మూడు రోజులు పాటు రాష్ట్రంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rainfall in Telangana) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఇదిలావుంటే, ఏపీలోనూ మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు (Rains in AP) కురవనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరి పంట చేతికొచ్చే సమయంలో, కోసిన పంట మార్కెట్‌కి తరలించే క్రమంలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా చోట్ల కోసిన పంట మార్కెట్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కరుస్తున్న వర్షాలు ఎటువంటి నష్టాన్ని తీసుకొస్తాయోనని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


Also read : Partial Curfew in AP : ఏపీలో కఠిన ఆంక్షలు, మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook