Eetela Rajender: కాన్వాయ్, సెక్యురిటీ సిబ్బందిని వెనక్కి పంపించిన ఈటెల రాజేందర్

Eetela Rajender convoy and security returned: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరో నిర్ణయం తీసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కాన్వాయ్‌ని ప్రభుత్వానికి అప్పగించేశారు. అలాగే తనకు గతంలో మంత్రి హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం ఈటల రాజేందర్ వెనక్కి పంపించేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2021, 11:12 PM IST
Eetela Rajender: కాన్వాయ్, సెక్యురిటీ సిబ్బందిని వెనక్కి పంపించిన ఈటెల రాజేందర్

Eetela Rajender convoy and security returned: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరో నిర్ణయం తీసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కాన్వాయ్‌ని ప్రభుత్వానికి అప్పగించేశారు. అలాగే తనకు గతంలో మంత్రి హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం ఈటల రాజేందర్ వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే హోదాలో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే గన్‌మెన్లు మాత్రమే ఈటల రాజేందర్‌తో ఉన్నారు. 

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా ?
నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో కలిసి చర్చించిన అనంతరం ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవి సైతం రాజీనామా చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఇంకా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగడం కంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే ఉద్దేశంలో ఈటల రాజేందర్ (Eetela Rajender to resign for MLA post) ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also read : Eatala Rajender slams CM KCR: సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివార్లలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్.. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన అనంతరం నుంచి సీఎం కేసీఆర్‌పై, ఆయన అనుచరులుగా పేరున్న నేతలపై సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌కి అసైన్డ్ భూముల్లోంచి రోడ్లు వేయలేదా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eetela Rajender) ప్రశ్నించారు. కావాలనే దురుద్దేశపూర్వకంగా తనను ఇందులో ఇరికించారని, తాను చట్టబద్దంగా కోర్టుకి వెళ్లి తానేంటో నిరూపించుకుంటానని ఈటల రాజేందర్ (Eetela Rajender press meet live updates) స్పష్టంచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News