Heavy Rains Alert: తెలంగాణలో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కడెక్కడంటే
Heavy Rains Alert: తెలంగాణకు ముసురు పట్టుకుంది. రెండ్రోజుల్నించి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుంటే ఇంకొన్ని ప్రాంతాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: తెలంగాణలో గత రెండ్రోజుల్నించి ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో మూడ్రోజులు భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఒడిశాకు ఆనుకుని జార్ఘండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఉండటంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే గత రెండ్రోజుల్నించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇప్పుడు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేరింది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. తెలంగాణకు అతి భారీ వర్షసూచన జారీ కావడంతో ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఐఎండీ సూచించింది. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం..
మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చు. ఇక సిద్ధిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు.
అదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురవనున్నాయి. మరోవైపు గోదావరి నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి మరింత వరద నీరు వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also read: కాంగ్రెస్‌లో చేరికలపై ఎంపీ కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook