Rains In Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు (Rains In Telangana) కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు (Rains In Telangana) కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరానికి దగ్గరలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీంతో గురువారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. US Open 2020 Winner: యూఎస్ ఓపెన్ 2020 విజేతగా డొమినిక్ థీమ్.. 71 ఏళ్ల తర్వాత సంచలనం
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా అటవీ భూములు ఉన్న జిల్లాల్లో వర్షం భారీగా కురవనుందని సూచించారు. నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు
కాగా, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నేడు హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. ఎడతెగని వానతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. Sreesanth Ban Ends: శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం.. ఐపీఎల్ ఛాన్స్ వస్తుందా?
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR