Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో ద్రోణి, భారీ వర్షసూచన, ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడీ పరిస్థితి నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న మూడ్రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.
పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగానే మరోవైపు ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తన ద్రోణి ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంటే సెప్టెంబర్ 3 నాటికి బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడవచ్చు. ఈ ద్రోణి ప్రభావంతో రానున్న మూడ్రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇక సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో అంటే రానున్న మూడ్రోజులు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. జగిత్యాల, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలు
ఇక ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, కరీంనగర్, పెద్దపల్లి, అదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో ఈ జిల్లాల్లో ఇప్పటికే ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షం పడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook