Hyderabad Rain Alert: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. మరో రెండు రోజులు అలర్ట్
Hyderabad Rain Alert: శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, బోరబండ, మాదాపూర్ , లింగం పల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మూడు గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిసింది
Hyderabad Rain Alert: హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. సెప్టెంబర్ లో శాంతించాల్సిన వరుణుడు.. అక్టోబర్ మూడో వారం వచ్చినా ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం దంచి కొడుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, బోరబండ, మాదాపూర్ , లింగం పల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మూడు గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిసింది.సికింద్రాబాద్, మణికొండ, నాంపల్లి, మెహిదీపట్నం, కోఠి, ఎల్బీ నగర్, ఎంజే మార్కెట్, ఉప్పల్, రామంతాపూర్, నల్లకుంట, హిమాయత్ సాగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి వరద పోటెత్తడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమలం అయ్యాయి. ఉదయం పూట విధులకు వెళ్లే ఉద్యోగోలు, కార్మికులు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ తో పాటు కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో తెలంగాణలో అత్యధికంగా ఇల్లంతకుంట మండలం మాల్యాలలో 142 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరులో 105, కరీంనగర్ జిల్లా వణవంకలో 105, సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురంలో 100, ములుగు జిల్లా వెంకాపూర్ లో 94 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ఉధృతంగా ప్రవహిస్తోంది. జూరాలకు వరద క్రమంగా పెరుగుతోంది. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద దిగువకు వెళుతోంది. ప్రకాశం బ్యారేజీకి శనివారం ఉదయం 4 లక్షల 7 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. అటు గోదావరికి క్రమంగా వరద పెరుగుతోంది. శ్రీరాంసాగర్ నాలుగు గేట్లు ఎత్తివేశారు అధికారులు.
Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook