Telangana Rains: దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు అలర్ట్
Telangana Rains: నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రమంతా ముసురు పట్టింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Telangana Rains: నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రమంతా ముసురు పట్టింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ , కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, వనపర్తి, నారాయణ పేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాది కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలోని వర్షం కురిసింది.
మంగళవారం ఉదయం 8-30 గంటల నుంచి బుధవారం ఉదయం ఏడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే.. సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర 6.7 సెంటిమీటర్ల వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింత కుంటలో 5.6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి ధర్మారంలో 56 మిల్లిమీటర్లు, మేడ్చల్ జిల్లా నేరెడ్ మెట్ లో 55 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కంది, మహబూబ్ నగర్ జిల్లా సర్విన్ కతాపూర్, నారాయణ పేట జిల్లా కొత్తపల్లి, కోస్గి మండలం గుండమల్ లో ఐదు సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also read: Maharashtra Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బలనిరూపణ ఎప్పుడు, గవర్నర్ ఏమంటున్నార
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి