Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, కొండాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి,మియాపూర్, కూకట్ పల్లి, అమీర్ పేట, పంజగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, నాంపల్లి, కోఠీ, సికింద్రాబాద్, ముషిరాబాద్, ఛాదర్‌ఘాట్, దిల్‌షుక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, బోడుప్పల్, హయత్ నగర్, ఘట్ కేసర్, ఈసీఐఎల్, కీసర, శామీర్‌పేట, బోయినపల్లి, మేడ్చల్, జీడిమెట్ల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద నీరు రోడ్లపైకి పోటెత్తడంతో అనేక చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నగరంలో మరో 3 గంటల పాటు భారీ వర్షం కురువనుందని తెలుస్తోంది. ఇప్పటికే గంటసేపు ఆగకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం కాగా.. మరో 3 గంటల పాటు భారీ వర్షం అంటే పరిస్థితి ఇంకెలా ఉంటుందా అని రోడ్లపై చిక్కుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నాలాలు వరద నీరుతో నిండిపోయాయి. గత వారం కలాడిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృత్యువాత పడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. 


లోతట్టు ప్రాంతాల్లో, వరదలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఉన్న చోట జీహెచ్ఎంసీ సిబ్బంది ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే వారు అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ఈ భారీ వర్షానికి తోడు ట్రాఫిక్ కూడా స్తంభించడం వాహనదారులను మరింత అవస్తలపాలుచేసింది.


https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/Hyderabad-Rain-news-updates.mp4/Hyderabad-Rain-news-updates.mp4


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK