Heavy rains due to low pressure in Bay of Bengal: జులై 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ఎల్లుండి చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Delta virus transmits through air: డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుంది


బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గురువారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల పంటలు నీట మునిగాయని రైతులు (Farmers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


Also read : RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ దరఖాస్తుకు ప్రభుత్వం ఆమోదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook