Telangana Lockdown: తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనల్ని మరింత కఠినం చేసింది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో నో ఎంట్రీ అంటోంది. కొత్తగా ఈ పాస్ ప్రవేశపెట్టింది. ఫలితంగా ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి(Corona Pandemic) కట్టడికై దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఫలితంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇటు తెలంగాణలో కూడా అమలవుతున్న లాక్‌డౌన్ సత్ఫలితాల్ని ఇస్తుండటంతో..మరింత కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana government) నిర్ణయించింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సైతం ఈ పాస్ ప్రవేశపెట్టింది. ఈ పాస్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తోంది. అయితే అంబులెన్స్‌లకు మాత్రం మినహాయింపు కల్పించింది.


తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశారు. లాక్‌డౌన్ (Lockdown) సడలింపు ఉంటుందనే ఉద్దేశ్యంతో భారీగా తరలివచ్చిన వాహనాల్ని కోదాడ సమీపంలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద నిలిపివేస్తున్నారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఉదయం పది గంటల్లోగా తెలంగాణలో ఎంట్రీ  ఇచ్చినా..ఈ పాస్ ( E Pass) ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఎమర్జెన్సీ వాహనాలైతే గుర్తింపుకార్డులు తప్పనిసిరగా చూపించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ కఠినతరం చేయడంతో సరకు రవాణాకు కూడా రాత్రి 9 గంటల్నించి ఉదయం 8 గంటల వరకే అనుమతి ఇస్తోంది. తెలంగాణ ప్రవేశపెట్టిన ఈ పాస్ కారణంగా భారీగా వాహనాలు బోర్డర్ వద్ద నిలిచిపోయాయి.


Also read: Telangana Lockdown: తెలంగాణలో ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ మరీ కఠినం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook