Nagarjuna Sagar:  నాగార్జున సాగర్‌ కు వరద కొనసాగుతోంది. దీంతో అది నిండు కుండలా మారింది. కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన జూరాల, శ్రీశైలంకు సంబంధించిన క్యాచ్ మెంట్ ఏరియాల్లో వర్షాలు పడటంతో నాగార్జున సాగర్ కు వరద పొటెత్తుతోంది. దీంతో ఈ సీజన్ లో నాగార్జున సాగర్ కు సంబంధించిన రెండోసారి గేట్టు ఎత్తారు. అంతేకాదు అక్కడ రెండు గేట్లు ఎత్తి 64వేల 455 క్యూసెక్కుల నీరు కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 590 అడుగులుగా ఉంది.
ముఖ్యంగా కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎగువనున్న డ్యామ్స్ ఇప్పటికే నిండిపోవడంతో  నీటిని  కిందికి వదులుతున్నాయి. ఈ సీజన్ లో మొదటిసారి  శ్రీశైలం డ్యామ్  నుంచి   దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు శ్రీశైలం పరివాహాక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో సాగర్ నుంచి పులిచింతలకు నీటిని విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగార్జున సాగర్  గేట్టు ఎత్తడంతో హైదరాబాద్ పరిసర  ప్రాంతాల ప్రజలు సాగర్ కు పోటెత్తుతున్నారు. అంతేకాదు అక్కడ అందాలను ఆస్వాదిస్తున్నారు. అటు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ బస్సు సర్వీసులు సాగర్  కు నడుస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే ఈ బస్సులో జనాలు క్యూ కడుతున్నారు.


నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.50 శతకోటి ఘనపుటడుగులు (టీఎంసీ) కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 310.85. శత కోటి ఘనపుటడుగులు (టీఎంసీ) వుంది. అంతేకాదు ప్రస్తుతం నాగార్జున సాగర్ కు 68,921 క్యూసెక్కుల నీటి ప్రవాహాం ఉంది. మరోవైపు ఔట్ ఫ్లూ 48,171 ఉంది. అంతేకాదు గతేడాది ఇదే సమయానికి 152.95 టీఎంసీలు ఉన్నాయి.


అటు శ్రీశైలంతో పాటు జూరాల తదితర ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్‌లో మరికొన్ని కొన్ని రోజులు నీటి ప్రవాహాం కొనసాగనుంది.ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు  నిండిపోయింది. కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల కూడా మరికొన్ని రోజుల్లో నిండిపోనుంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణా ప్రవహించే పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం జాగ్రత్తలు జారీ చేసింది. అంతేకాదు అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తోంది.  


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి