Ts News: రంగారెడ్డి జిల్లా  మంచిరేవుల ఫాంహౌస్‌(Manchirevula case)లో పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నటుడు నాగశౌర్య(Hero Naga Shourya)  తండ్రి శివలింగప్రసాద్‌(Shivalinga Prasad)ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. మంచిరేవుల ఫాంహౌజ్‌ను శివలింగప్రసాద్‌ లీజ్‌కు తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌తో కలిసి ఫాంహౌస్‌లో పేకాట ఆడిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివలింగప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. కాగా, శివలింగప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఉప్పర్‌పల్లి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.


Also Read: Mariyamma lockup death case: మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు సీరియస్


పలువురు అరెస్ట్..
 మంచిరేవుల పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు(Gambling Case in Hyderabad) ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహబూబాబాద్ మాజీ ఎమ్యెల్యే శ్రీరామ్ భద్రయ్య ఇప్పటికే అరెస్టయినట్లు వెల్లడించారు. పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్​.. మరో 29 మందిని ఫామ్‌హౌస్‌కు పిలిచి పేకాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. 


ఫాం​హౌస్​​పై ఆదివారం రాత్రి నిర్వహించిన దాడుల్లో రూ.6,77,250, 31 సెల్​ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నామని ... 4 టేబుళ్లలో నగదు పెట్టి పేకాట(Gambling Case in Hyderabad) ఆడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 30 మందిపై టీఎస్ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని... సీఆర్‌పీసీ 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నార్సింగి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి... 30 మంది నిందితులను ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook