గన్ మెన్ల ఉపసంహరణ అంశంపై హైకోర్టు తీర్పు నాగం జనార్థన్ రెడ్డికి అనకూలంగా వచ్చింది. తనకు గన్ మెన్లను తొలగించిన అంశంపై హైకోర్టులో నాగం  పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం కావాలనే తన భద్రతను ఉపసంహరించుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగం పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం నాగం తరఫు న్యాయవాది వాదనలను సమర్ధించింది. అంతే కాదు నాగంకు భద్రతను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతిపై తాను హైకోర్టులో పిల్ వేశానని... ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని..భద్రత కల్పించాలని గతంలో నాగం రాష్ట్ర ప్రభుతానికి అభ్యర్ధించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు గన్ మెన్లు కేటాయించింది. అయితే కొన్ని కారణాల వల్ల భద్రతను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో నాగం జనార్థన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ కు దాఖలుచేశారు.