Heavy Rains In Hyderabad for Today and Tomorrow: హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహా నగరానికి ప్రధాన నీటి వనరులుగా పేరున్న జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు వరద నీరు వస్తోంది. దీంతో శుక్రవారం జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. రిజర్వాయర్ 2 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని జలమండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కి 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 700 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు గండిపేట్ లోని ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు 700 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో వస్తోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 2.760 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.15 అడుగులకు చేరుకుంది. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురువనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో రెండు రోజుల్లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు నిండు కుండలా మారే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. 


జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో జలాశయాల దిగువ ప్రాంతాల్లోని నది పరివాహక ప్రాంతాల్లో వరద తాడికి పెరిగే అవకాశం ఉందని జలమండలి ఎండి దానకిశోర్ తెలిపారు. సంబంధిత అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని దాన కిషోర్ హెచ్చరికలు జారీచేశారు.


హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1762.75 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.650 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 700 క్యూసెక్కులు
 మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 02


ఇది కూడా చదవండి : Telangana Rains Updates: ఏయే జిల్లాల్లో, ఏయే ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందంటే


ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసిలోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. ఈ కారణంగానే మూసి పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ జలమండలి ఎండి దాన కిషోర్ ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇది కూడా చదవండి : Electricity Dept Issues: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లతో ప్రమాదం పొంచి ఉంటే ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి