Four Drown In The wardha River At Komaram Bheem Asifabad: దేశంలో అన్ని చోట్ల హోలీ పండుగను ఎంతో గ్రాండ్ గా చేసుకుంటున్నారు. రంగులను పూసుకుంటూ, ఎంతో జోష్ తో పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు నేచురల్ హోలీని జరుపుకుంటే, మరికొందరు మాత్రం కెమికల్స్ రంగులను ఉపయోగించి  హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఉదయం నుంచే జనాలంతా హోలీని ఎంతో వేడుకగా జరుపుకున్నారు.కొందరు హోలీలో మద్యం తాగుతూ, ఫ్రెండ్స్ దావత్ లు కూడా చేసుకున్నారు. మరికొందరు భంగ్ అనే మత్తుపదార్థంను కూడా ఫుల్ గా తాగారు.ఇలాంటి జోషల్ గా జరుగుతున్న హోలీ వేడుకల్లో ఆ గ్రామంలో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Romantic Reels: వీళ్లసలూ అమ్మాయిలేనా..?.. రోమాన్స్ రీల్స్ తో నడిరోడ్డు మీద రచ్చ.. వీడియో వైరల్..


కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. కౌటాలా మండలం తాటిపల్లి గ్రామంలో జరిగిన హోలీ వేడుకలు కన్నీటిని మిగిల్చాయి. హోలీ ఆడిన తర్వాత నలుగురు యువకులు వార్దానదిలోకి స్నానానికి వెళ్లారు. బట్టులు ఒడ్డున పెట్టేసి నీళ్లలోకి దిగారు. మరీ ఏంజరిగిందో కానీ నలుగులు కూడా విగతజీవులుగా మారిపోయారు. ఎంతసేపైన పిల్లలు రాకపోవడంతో వీరీ కుటుంబీకులు ఫోన్ లు చేశారు.


Read more: King Cobra Bathing: కింగ్ కోబ్రాకు చల్లని నీళ్లతో స్నానం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో..


ఎవరు ఆన్సర్ చేయకపోవడంతో, నది దగ్గరకు వచ్చిచూశారు. ఒడ్డున బట్టలు ఉన్నాయి. ఇక గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపుచేపట్టారు. ఈ గాలింపులో నలుగురు యువకులు శవాలు బైటపడ్డాయి. చనిపోయిన వారిలో సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.వెంటనే వీరి మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు. యువకులు మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook