Ganesh Immersion 2022: హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడ లేనివిధంగా ఏర్పాట్లు సైతం జరుగుతాయి. తాజాగా గణేష్‌ నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాల పరిధిలో రేపు సెలవు ప్రకటించారు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు హాల్‌ డే ప్రకటించారు. ఇందులోభాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపటికి బదులుగా నవంబర్ 12న(రెండో శనివారం) పని దినంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. సాగర తీరంలో అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి. రేపు(శుక్రవారం) జరగనున్న గణేష్‌ శోభాయాత్రకు అంతా ముస్తాబైంది. హైదరాబాద్‌లో గల్లి గల్లికి వెలిసిన విఘ్నేశ్వరుడి ఇక సెలవంటూ నిమజ్జానికి వెళ్లనున్నాడు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


వినాయకుడి ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం ప్రదేశాల్లో రోడ్లను మూసివేశారు. ఈనెల 9,10 రోజుల్లో హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో రహదారులను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువులో నిమజ్జనాలు జరగనున్నాయి. ఈనేపథ్యంల ఐడీఎల్ ట్యాంక్ వద్ద సందర్శకులకు అనుమతి లేదు. కూకట్‌పల్లి వై జంక్షన్ నుంంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు..జేఎన్‌టీయూ, ఫోరమ్ మాల్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. 


హైటెక్ సిటీ, మాదాపూర్ నుంచి కైతలాపూర్‌ మీదుగా కూకట్ పల్లి వై జంక్షన్‌ వెళ్లే వాహనాలు..రెయిన్ బో విస్టా-మూసాపేట్ రోడ్డు వైపు మళ్లించారు. అల్వాల్ హస్మత్ పేట్ చెరువులో వినాయక నిమజ్జనాలు జరుగుతాయి. దీంతో అక్కడ వాహనాలకు నో ఎంట్రీ ఉంది. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి, ఇతర కాలనీల నుంచి గణేష్‌ విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు అంజయ్య నగర్ మీదుగా హస్మత్ పేటకు వెళ్లాలని తెలిపారు. 


నిమజ్జనం పూర్తైన తర్వాత పాత బోయిన్‌పల్లి, మసీదు రోడ్డు, హరిజన బస్తీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సూరారం కట్టమైసమ్మ ట్యాంక్‌లో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాలానగర్, జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండి మైసమ్మ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనదారులు..బౌరంపేట, గండి మైసమ్మ సమీపంలోని సూరారం మీదుగా పంపనున్నారు. ఇలా నగరంలో ప్రతి చోట ట్రాఫిక్‌ మళ్లింపులతోపాటు ఆంక్షలు విధించారు. 


Also read:Divya Vani to Join BJP: బీజేపీలోకి దివ్యవాణి.. అంతా సిద్ధమే కానీ?


Also read:MLC KAVITHA:ఈసారి కవిత బతుకమ్మ ఎక్కడ.. ఈడీ ఆఫీసా, సిబిఐ ఆఫీసా? కోమటిరెడ్డి ట్వీట్ తో రాజకీయ రచ్చ... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి