Graduate MLC Election: తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సోమవారం జరుగనుంది. ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఆయన గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలి


 


ఈ ఉప ఎన్నికలో గతసారి పోటీ చేసిన తీన్మార్‌ మల్లన్న ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తుండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలో దిగారు. ఇక బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, జక్కా జాన్సన్‌, అశోక్‌ కోచింగ్‌ సంస్థ నిర్వాహకులు అశోక్‌ తదితరులు పోటీ చేస్తున్నారు. మరోసారి ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటుతుందని తెలుస్తోంది. విద్యావంతుడైన రాకేశ్‌ రెడ్డికి పట్టభద్రులు మద్దతుగా నిలుస్తున్నారు. మల్లన్నపై అనేక ఆరోపణలు, బ్లాక్‌మెయిల్‌ వంటి వ్యవహారాలు చేటు చేస్తున్నాయి.

Also Read: KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్‌ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు


అయితే ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతోపాటు విద్యావంతులకు సంబంధించిన ఎన్నిక కావడంతో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ ఎన్నికలో ఓటు వినియోగం తీవ్ర గందరగోళంగా ఉంటుంది. ఓటు వేయడంపై అవగాహన ఉంటే తప్ప ఓటును సక్రమంగా వినియోగించుకోలేం. ఏ చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఓటింగ్‌ విధానం ఇలా ఉంటుంది. తెలుసుకోండి.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం ఇలా


  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకమైనవి. సాధారణ ఎన్నికల్లో ఈవీఎం ఉంటే ఇక్కడ బ్యాలెట్‌ పేపర్‌ ఉంటుంది.

  • ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ ఉండడంతో బ్యాలెటర్‌ పేపర్‌ చాలా పెద్దదిగా ఉంటుంది.

  • ఈ ఎన్నికల్లో డిగ్రీ చేసిన వారు మాత్రమే పోటీకి అర్హులు. ఓటర్లు కూడా డిగ్రీ చేసిన వారు మాత్రమే ఉంటారు.

  • పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్ బ్యాలెట్‌ పేపర్‌, పెన్ను ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే వేయాలి. ఇతర పెన్నులతో వేస్తే ఓటు చెల్లదు.

  • బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థుల పేర్లు ఉండగా.. వాటికి ముందు ఒక బాక్స్‌ ఉంటుంది.

  • ఒక్క ఓటర్‌ ఎన్ని ఓట్లయినా వేయవచ్చు. ఆ బాక్స్‌లో పెన్నుతో నంబర్లు వేయాల్సి ఉంది. మీకు నచ్చిన అభ్యర్థికి 1, 2, 3, 4, 5 వంటి నంబర్లతో అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

  • ఓటు వేసేందుకు ఏ గుర్తింపు కార్డయినా తీసుకెళ్లవచ్చు. ఓటరు ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర కార్డులు తీసుకెళ్లాలి.

  • 1 నంబర్ వేస్తే మొదటి ప్రాధాన్యం అంటారు. 2నంబర్‌ వేస్తే రెండో ప్రాధాన్య ఓట్లు అంటారు. సాధారణంగా మొదటి ప్రాధాన్యం ఓట్లను మాత్రమే ఓటు లెక్కిస్తారు.

  • మొదటి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి మెజార్టీ రాని పరిస్థితుల్లో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కేస్తారు. 

  • ఈ రెండింటిలోనూ ఏ అభ్యర్థికి మెజార్టీ రాకపోతే మూడో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కిస్తారు.







స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter