Union Cabinet Race: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభ కొంత తగ్గగా.. తెలంగాణలో మాత్రం బలంగా పుంజుకుంది. గతం కంటే రెట్టింపు లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. 17 స్థానాల్లో ఎనిమిదింట కాషాయ జెండా రెపరెపలాడింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడంతో తెలంగాణకు ప్రాధాన్యం లభించనుంది. పార్టీకి అత్యధిక స్థానాలు దక్కిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండడంతో త్వరలో కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవిలో ఎవరూ ఉంటారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి పదవిపై 8 మంది ఎంపీలు రేసులో ఉన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?


 


ఆదిలాబాద్‌లో గోడం నగేశ్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మెదక్‌ రఘునందన్‌ రావు, నిజామాబాద్‌ ధర్మపురి అరవింద్‌, కరీంనగర్‌ బండి సంజయ్‌, సికింద్రాబాద్‌ కిషన్‌ రెడ్డి, మల్కాజిగిరి ఈటల రాజేందర్‌, మహబూబ్‌నగర్‌ డీకే అరుణలు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి పదవులపై ఎంపీలందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ముగ్గురు నలుగురు ఆశిస్తున్నారు. వారిలో పార్టీలో సీనియర్‌ నాయకులైన కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ ప్రధానంగా పోటీ పడుతున్నారు.

Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్‌ పే నంబర్‌ అంటూ పిచ్చి రాతలు


 


ఇప్పటికే రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి పని చేశారు. మరోసారి ఆయన కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. దీనికితోడు రెండుసార్లు మంత్రిగా పని చేయడంతో కిషన్‌ రెడ్డికి అవకాశం లేకపోవచ్చు. అయితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల చొప్పున ఆయన సారథ్యంలో పార్టీ గెలవడం కిషన్‌ రెడ్డికి సానుకూలంగా మారే అవకాశం ఉంది.


ప్రధానంగా కేంద్ర మంత్రి రేసులో డీకే అరుణ ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసమే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్లమెంట్‌కు పట్టుబట్టి మరి పోటీ చేశారు. అయితే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికలో అతి స్వల్ప లక్ష్యంతో అరుణ గట్టెక్కారు. భారీ మెజార్టీతో గెలుస్తానని భావించిన ఆమెకు తీవ్ర పోటీ ఎదురైంది. ఆమె మెజార్టీ మినహా అరుణకు కేంద్ర మంత్రివర్గం స్థానం లభించకపోవడానికి ఎలాంటి ప్రతికూల అంశాలు లేవు. మహిళా కోటాతోపాటు పార్టీలో సీనియర్‌ నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఆమెకు విశేష రాజకీయ అనుభవం ఉంది. గతంలో పార్టీ అప్పగించిన ఇతర రాష్ట్రాల బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇలా ఇన్ని సానుకూల అంశాలు ఉండడంతో డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.


కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని ఈటల రాజేందర్‌ కూడా ఆశిస్తున్నారు. కేంద్ర మంత్రి రేసులో ఈటల ప్రధానంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్‌ అనూహ్యంగా మారిన పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఆయన లోక్‌సభ ఎన్నికలో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటులో దాదాపు 3 లక్షల మెజార్టీతో గెలవడం ఈటలకు కలిసొచ్చే అంశం. బీజేపీ తరఫున ఎన్నికైన ఎంపీల్లో ఈటలకే అత్యధిక మెజార్టీ ఉంది. మెజార్టీతోపాటు సీనియార్టి కూడా తోడవడంతో కేంద్ర మంత్రి వర్గంలో ఈటల కూడా ఉండొచ్చు.


కరీంనగర్‌, నిజామాబాద్‌ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్‌ కుమార్‌, ధర్మపురి అరవింద్‌లు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. కానీ వీరిద్దరికీ అవకాశం లభించకపోవచ్చు. పార్టీకి నమ్మిన బంటులైనా వీరికి కేంద్ర పదవులు కాకుండా రాష్ట్రంలోనే కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, తెలంగాణలో ఉన్న పరిస్థితుల రీత్యా వీరిద్దరూ కేంద్ర మంత్రి పదవి దక్కకపోవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter