హైదరాబాద్: నగర శివార్లలో సోమవారం గాలి వాన బీభత్సం సృష్టించింది. రంగా రెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం పరిసరాల్లో భారీ గాలి దుమారంతో పాటు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి కోహెడలో నిర్మించిన తాత్కాలిక ఫ్రూట్ మార్కెట్‌లోని (Koheda fruit market) రేకుల షెడ్లు అన్నీ నేలమట్టమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


హైదరాబాద్‌‌లోని కొత్తపేట నుంచి ఈ మార్కెట్‌ను ఇటీవలే రంగారెడ్డి జిల్లా కోహెడకు తరలించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ రేకుల షెడ్లు వేయగా... అవి ఈ గాలి వానకే నేలకూలాయి.



 


ఈ ఘటనలో హమాలీలు, పండ్ల వ్యాపారులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్ల రైతులు, లారీల డ్రైవర్లలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. గాలివానకు రేకులు, షెడ్స్ నేలమట్టమైన ఈ దృశ్యాలు చూస్తే.. అక్కడి దుస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ గాలివానకు రంగారెడ్డి జిల్లాలోని పలు పండ్ల తోటలు, పంట పొలాలు సైతం దెబ్బతిన్నట్టు సమాచారం అందుతోంది.