హైదరాబాద్ : తన భర్త మధుసూదన్ ఆచూకీ కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వనస్థలిపురం మహిళకు.. ఆమె భర్త కరోనాతో మృతి చెందగా జీహెచ్ఎంసీ సిబ్బందే ( GHMC ) అంత్యక్రియలు పూర్తిచేశారని తెలిసిన విషయం నగరంలో ఎంత వివాదమైందో తెలిసిందే. భార్యకు కూడా చెప్పకుండానే భర్త శవానికి ఎలా అంత్యక్రియలు ( Cremation ) పూర్తి చేస్తారని మహిళ నిలదీసిన నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ( Minister Etela Rajender ) ఆ వివాదంపై స్పందించారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు (Gandhi hopsital doctors ) వారి ప్రాణాలకు తెగించి కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం చేస్తున్నారని.. వాళ్ళపై లేనిపోని ఆరోపణలు చేయటం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాతో చనిపోతే.. వారి అంత్యక్రియలు చేయటానికి కుటుంబసభ్యులే భయపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లోనూ వైద్యులు కరోనా రోగులకు ( Coronavirus positive patients ) చికిత్స అందించి మానవత్వం చాటుకుంటున్నారని చెబుతూ వృత్తిపట్ల వైద్యులకి ఉన్న అంకిత భావాన్ని మంత్రి ఈటల ప్రశంసించారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పని చేస్తోంది.. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా ప్రకటన చేస్తోందన్నారు మంత్రి. ( Also read : వరంగల్‌లో బావిలో దూకిన వలసకూలీల కుటుంబం )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 29వ తేదీన వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే పేషంట్ కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇరవైనాలుగు గంటలలోపే 30వ తేదీన ఆయన చనిపోయారు. ఈశ్వరయ్య పాజిటివ్‌తో చనిపోయినందున ఆయన కుటుంబ సభ్యులందరికీ కోవిడ్-19 పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతూ గాంధీ ఆస్పత్రికి వచ్చారు. 1వ తేదీన ఆయన కూడా చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులు అందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. భార్యకి చెప్తే షాక్‌కి గురవుతుంది అని గంబీరమైన సందర్భంలో చెప్పకుండా ఉండడమే మేలని చుట్టాలు చెప్పిన నేపథ్యంలో మృతదేహాన్ని పోలీసులకి అప్పగించి GHMC ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారని మంత్రి వివరించారు. ( Read also : Cyclone Amphan deaths : అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి )


బంధువులకు చెప్పకుండా కరోనా వచ్చిన మధుసూదన్‌ను ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది అని వస్తున్న ఆరోపణలను మంత్రి ఈటల ఖండించారు. కరోనావైరస్ నుంచి కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..