Husband kills wife less than six months after wedding over extramarital affair suspicion in moosapet Hyderabad: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించాడు. పెళ్లి అయిన ఆరు నెలలకే భార్యను కిరాతంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని మూసాపేటలో (Moosapeta) ఈ దారుణం జరిగింది. ఒడిశాలోని (Odisha) గురండి మండలం రంప గ్రామానికి చెందిన భాస్కర్‌‌రావు, కనకమ్మ దంపతులు (Bhaskar Rao and Kanakamma couple) హైదరాబాద్‌కు వలస వచ్చారు. అలాగే కొన్ని ఏళ్ల క్రితం శ్రీకాకుళంలోని (Srikakulam) హిర మండలం గొట్టాబ్యారేజీ గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబం కూడా హైదరాబాద్ (Hyderabad) వచ్చి ఇక్కడే స్థిర పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు కుటుంబాలు మూసాపేటలో నివాసం ఉంటున్నాయి.  ఈ క్రమంలో కన్నయ్య కుమారుడు సంతోశ్‌కు.. భాస్కర్‌‌రావు తన కూతురు శిరీషను ఇచ్చి ఆరు నెలల క్రితం పెళ్లి జరిపించారు. 3లక్షల నగదుతో పాటు బంగారం, ఇంటి సామగ్రి కట్నంగా ఇచ్చాడు. 


శిరీష, సంతోశ్‌లు (Sirisha, Santosh‌) ఇద్దరూ మూసాపేటలోనే నివాసం ఉండేవారు. పెళ్లి కొన్ని రోజులకే శిరీషపై సంతోష్​కు అనుమానం పెరిగింది. రోజూ సంతోశ్‌.. శిరీషను (Santosh, Sirisha) వేధించేవాడు. దీంతో చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. వారిద్దరికీ సర్ది చెప్పి మళ్లీ కాపురం చేసుకునేలా చేశారు.


Also Read : మా నాన్నే నా హీరో.. బెస్ట్ ఫ్రెండ్... లిద్దర్ శవపేటిక వద్ద కన్నీటిపర్యంతమైన కుమార్తె


అయినా కూడా  సంతోశ్‌.. శిరీషను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో శిరీషను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని (Dead body) ఇంట్లో పెట్టి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. అయితే కుటుంబ సభ్యులు ఇంటికి రాగా ఇళ్లు తాళం వేసి ఉండడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. తర్వాత సంతోశ్‌కు (Santosh) ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటికెళ్లి తాళం పగులగొట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సంతోశ్‌... శిరీషను చంపి ఇంట్లోనే శవం ఉంచి పరారైనట్లు గుర్తించారు. నిందితుడు సంతోశ్‌ కోసం పోలీసులు (Police) గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 


Also Read : Which Hero Dominates Rajamouli: రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసిన హీరో ఎవరో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook