Which Hero Dominates Rajamouli: రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Which Hero Dominates Rajamouli: డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి కెరీర్ లో అతడ్ని డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో గురించి బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 04:25 PM IST
Which Hero Dominates Rajamouli: రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Which Hero Dominates Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే ఓ రేంజ్​లో ఉంటాయి. హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దాంతో పాటు ఆయన సినిమాల్లో సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆయుధాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే రాజమౌళి తెరకెక్కించిన్న చిత్రాల్లో ఆయన మార్క్ తప్పకుండా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ ప్రేక్షకులను ఆయనే మరిపిస్తారు.

కానీ, అంతటి స్టార్ డైరెక్టర్ రాజమౌళినే ఓ హీరో డామినేట్ చేశాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరో? ఏ సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో డామినేట్ చేశాడో తెలుసా? ఈ విషయాన్ని రాజమౌళికి వరుసకు పెద్దన్న అయిన సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"రాజమౌళి రూపొందించిన సినిమాలన్నింటిలో ప్రతి ఒక్క విభాగానికి ఏదైనా ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. ప్రతి విభాగాన్ని ఆయనకు అవసరమైనట్లు బాగా వినియోగించునేవారు. 'స్టూడెంట్​ నం.1' సినిమాలో సంగీతం, 'సింహాద్రి'లో స్టోరీ, 'సై' చిత్రంలో డైరెక్షన్ డామినేట్ చేశాయి. 'ఛత్రపతి' సినిమాకు మాత్రం అన్ని సరిసమానంగా కుదిరాయి. కానీ 'విక్రమార్కుడు' విషయంలో మాత్రం వీటికి భిన్నంగా జరిగింది. హీరో రవితేజ సినిమా మొత్తాన్ని డామినేట్​ చేశారు" అని సంగీత దర్శకుడు కీరవాణి చెప్పారు. 

2006లో విడుదలైన 'విక్రమార్కుడు' చిత్రం.. పూర్తి మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా పోలీస్​ కథతో తెరకెక్కింది. ఇందులో రవితేజ.. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాఠోడ్​ పాత్రల్లో అభిమానుల్ని తెగ ఆకట్టుకున్నారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం సహా బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా 'ఆర్ఆర్ఆర్'. రామ్​చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గురువారం విడుదలైన ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Also Read: Mahesh Babu: స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్-ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు రియాక్షన్...

ALso Read: Vicky Katrina Marriage Photos: విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ పెళ్లి ఫొటోలు వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News