Manikonda Municipal DEE: నా భార్య లంచగొండి.. సంచలన వీడియో లీక్ చేసిన భర్త
Husband Leaked Wife Corruption Videos: తన భార్య లంచగొండి అంటూ ఓ భర్త తమ ఇంట్లో డబ్బుల కట్టలను వీడియో తీసి మీడియాకు పంపించారు. లంచం తీసుకోవద్దని తన భార్యకు చెప్పినా వినట్లేదని ఆ వీడియోలలో పేర్కొన్నారు.
Husband Leaked Wife Corruption Videos: మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని స్వయంగా భర్తే బయటపెట్టాడు. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను వీడియో తీసి రిలీజ్ చేశారు. లంచం డబ్బులు మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు లేకుండా ఇంటికి రాదని భర్త తెలిపారు. దాదాపు 80 లక్షల రూపాయల నోట్ల కట్టలు ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన భర్త తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్ష్యాలు అంటూ వీడియోల విడుదల చేశారు. పెద్ద ఎత్తున మణికొండలో కాంట్రాక్టర్‌ల నుంచి కమిషన్‌ను తీసుకుంటూ లంచాలు భారీగా ఇంటికి తీసుకువస్తోందని భర్త శ్రీపాద ఆరోపించారు. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో రెండు రోజుల క్రితం GHMCకి ఉద్యోగాన్ని మార్పించుకుంది దివ్యజ్యోతి. చెప్పిన మాట వినకపోవడంతో భార్యకు భర్త శ్రీపాద విడాకులు నోటీస్ పంపారు.
ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని భర్త సంచలన ఆరోపణలు చేశారు. తను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్షాలు అంటూ ఇంట్లో కొన్ని వీడియోలు విడుదల చేశారు. ఇంట్లో ప్రతిచోట కట్టల కట్టల డబ్బులు చూపిస్తూ 20 నుంచి 30 లక్షలు తీసుకొస్తుందన్నారు. ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా మార్చుకొక పోవటంతో వీడియోలు మీడియాకు పంపించారు. తన భార్య ఆమె తమ్ముడికి రూ.70 లక్షలు అకౌంట్‌లోకి వేసిందని.. మరో రూ.40 లక్షలు క్యాష్‌గా ఇచ్చిందని చెప్పారు. డబ్బులు ఎక్కువకావడంతో ఇంట్లో ఎవరిని లెక్క చేయట్లేదన్నారు. అంతేకాకుండా భార్యతో మాట్లాడిన ఆడియోలను లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also read: AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.