Hyderabad Murder 2 Accused Making Reels On Byke And Uploaded In Instagram: కొందరు యువకులు రీల్స్ పిచ్చిలో ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కొందరు రోడ్ల మీద ఇష్టమున్నట్లు రీల్స్ చేస్తున్నారు. మరికొందరు ట్రైన్ లలో రొమాన్స్ చేస్తు రీల్స్ చేస్తున్నాను. జనాలు ఏమనుకుంటారోనన్న ఆలోచనకూడా నానా రచ్చ చేస్తున్నారు. కొందరు వాహనాల మీద వెళ్తు కూడా రీల్స్ చేస్తున్నారు. కొండలు, జలపాతాలు, అడవులలో రీల్స్ చేసి, ఎందరో యువత ప్రమాదాలలో చిక్కుకున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రీల్స్ తో యువత  ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల తమ లైఫ్ ను కూడా రిస్క్ లో పడేస్తున్నారు. ఇక మరికొందరు దాడులు చేస్తున్నప్పుడు, పైశాచికంగా వేధిస్తున్నప్పుడు కూడా రీల్స్ చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 



పూర్తి వివరాలు..


హైదరాబాద్ లోని బాచుపల్లి పరిధిలో దారుణ ఘటన జరిగింది. బాచుపల్లి పీఏస్ పరిధిలో తేజస్ ఆలియాస్ సిద్దు అనే యువకుడిని ఇద్దరు యువకులు వెంటాడారు. అంతే కాకుండా.. 12 సార్లు కత్తులతో పొడిచి, తలపై బండరాళ్లతో మోదీ దారుణంగా హత్య చేశారు. అనంతరం బైక్‌పై వెళుతూ.. రక్తంతో ఉన్న కత్తులు, చేతులను చూయిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేశారు. ఈ భయానక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా  మారియి. ప్రస్తుతం పోలీసులు ఈ ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాగా, గత సంవత్సరం తరుణ్ రాయ్ అనే యువకుడిని హత్య చేసిన కేసులో  సిద్దుని ఏ3 గా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలో ఇతను రెండు నెలల క్రితమే జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్రగతి నగర్ లోని తన తల్లితో కలిసి ఉంటున్నాడు. దీంతో సిధ్దూ.. తన మిత్రులతో కలిసి  ఇంట్లో మద్యంతాగాడు. ఆతర్వాత.. ప్రగతి నగర్ లో రోడ్డుమీద మాట్లాడుకుంటున్నారు. వీరిని గమనించిన గతంలోలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు కత్తులతో పొడిచి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. సిద్ధూను తరుణ్ రాయ్ స్నేహితులు హత్య చేసినట్లు సమాచారం.


Read more: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..


ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఉలిక్కిపడింది. అసలే వరుస పండుగలు.. ఈ నేపథ్యంలో హత్య చేసి ఏమాత్రం భయం లేకుండా ఇష్టమున్నట్లు ఈ విధంగా బైక్ మీద తిరుగుతూ రీల్స్ చేయడం ఏంటని, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన మాత్రం బాచుపల్లి పరిధిలో తీవ్ర కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook