హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఎంబీఏ విద్యార్థిని
హైదరాబాదు నగరంలో 23ఏళ్ల యువతి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాదు నగరంలో 23 ఏళ్ల యువతి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న ఆమెను బి.హనీషగా పోలీసులు గుర్తించారు. అనంతపురానికి చెందిన ఈ యువతి కొంపల్లిలోని శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోఎంబీఏ ద్వీతీయ సంవత్సరం చదువుతోంది. స్నేహితుడితో వీడియో కాల్ లో మాట్లాడుతూ యువతి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
'23ఏళ్ల ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్ధిని కాలేజీ హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది' అని పోలీసు ఇన్స్పెక్టర్ చెప్పారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని అటాప్సి కోసం పంపారు. 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వీడియో కాల్ లో మాట్లాడిన స్నేహితుడిని పోలీసులు విచారిస్తున్నారు.