హైదరాబాద్లో దారుణం: ఐదేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడు అఘాయిత్యం
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం.. నగరంలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల అబ్బాయి ఐదు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు ప్రకారం, బాలికను తల్లి ఫస్ట్ లాన్సర్‌లో ఉన్న స్నేహితురాలి వద్ద ఉంచి ముంబైకి వెళ్ళింది. తల్లి పనిమీద బయటకి వెళ్లడంతో స్నేహితుని కుమారుడు.. బాలికపై అత్యాచారాని పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముంబై నుండి హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తల్లి.. కుమార్తెని ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడు ఆ అమ్మాయి కడుపు నొప్పి అని చెప్పడంతో ఆస్పత్రికి వెళ్లి చూపించగా.. అక్కడ వైద్యులు అత్యాచారం జరినట్లు నిర్ధారించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అఘాయిత్యం చేసిన బాలుడు మైనర్ కావడంతో.. కుటుంబ సభ్యుల సమక్షంలో అతడ్ని విచారిస్తున్న పోలీసులు.. బాలిక మెడికల్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు.