Nano Mask: కరోనా బారిన పడకుండా ఉండాలంటే నాణ్యమైన మాస్కులు ధరించడం ఉత్తమం. మార్కెట్లో రకరకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ఎన్ 95, మల్టీ లేయర్ మాస్క్, ఫేస్ మాస్క్, క్లాత్ మాస్క్ ఇలా చాలా రకాలే ఉన్నాయి. తాజాగా కొవిడ్ నుండి రక్షణ కల్పించేందుకు నానో మాస్కును (Nano Mask) అభివృద్ధి చేశారు శాస్తవేత్తలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూమెటీరియల్స్‌ (ARCI) శాస్త్రవేత్తలు నానో మాస్క్‌లను అభివృద్ధి చేశారు. ఇవి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేయడంతో పాటు భూమిలో సులువుగా కలిసిపోయే బయో డిగ్రేడబుల్‌ నూలు (కాటన్‌) మాస్క్‌లు. రాగి ఆధారిత నానో పార్టికల్‌ కోటెడ్‌ ఫ్యాబ్రిక్‌తో యాంటీ వైరల్‌ మాస్క్‌ను శాస్త్రవేత్తలు డాక్టర్‌ టి.నర్సింగరావు, డాక్టర్‌ కల్యాణ్‌ హెబ్రమ్‌, డాక్టర్‌ బి.వి.శారద బృందం తయారు చేశారు.


ఈ మాస్కులను సీసీఎంబీలో (CCMB) పరీక్షించగా 99.9 శాతం వైరస్‌, బ్యాక్టీరియా నుంచి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేశాయని ఏఆర్‌సీఐ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ టి.నర్సింగరావు తెలిపారు. ‘'రాగిలో బ్యాక్టీరియాను చంపే గుణముంది. అందుకే రాగి ఆధారిత నానో కాంపోజిట్‌ పార్టికల్‌ కోటెడ్‌తో మాస్క్‌లను తయారు చేశాం. బెంగళూరుకు చెందిన రెసిల్‌ కంపెనీ నూలు వస్త్రంపై కాపర్‌ నానో కాంపోజిట్‌ పార్టికల్స్‌ను అద్దుతోంది. కంపెనీలు ముందుకొస్తే పెద్దఎత్తున తయారీకి అప్పగిస్తాం' అని నర్సింగరావు వెల్లడించారు. 


Also Read: Weather news: తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా... భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook