Hyderabad Begumpet Mother And Daughter Fight With Thief: హైదరాబాద్ దొంగలకు, ఆగంతకులకు అడ్డాగా మారింది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట తాళాలు ఉన్న ఇళ్లమీద ఆగంతలకులు ఒక కన్నేస్తున్నారు. ఆ తర్వాత రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల అపార్ట్ మెంట్ లు, ఇళ్లలో పనివాళ్లలాగా చేరి నమ్మకం కలిగాక... ఎక్కవ ఏ వస్తువులు ఉన్నాయో చూసుకున్న తర్వాత మరల చోరీలకు పాల్పడున్నారు. ఇటీవల హైదరాబాద్ చోరీల ఘటన తరచుగా వార్తలలో ఉంటున్నాయి. అదికూడా పోలీసులకు కూతవేటు దూరంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకొవడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే హైదరాబాద్ లోని నిజాంపేటలో ఇటీవల ఒక గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి మహిళను టెన్షన్ గురిచేశాడు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పూర్తి వివరాలు..


హైదరాబాద్ లోని బేగంపేటలో ఊహించని ఘటన సంభవించింది.రసూల్ పుర జైన్ కాలనీలో జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. పోలీసుల ప్రకారం.. సుశీల్, ప్రేమ్ చంద్ లిద్దరు కొరియర్ నేపంతో.. నవరతన్ జైన్, అమిత ఇంట్లోకి ప్రవేశించారు. వీరిని ఇంటి బయట ఉండాల్సిదింగా అమిత సూచించింది.కానీ అప్పటికే వీరు చోరీకి ప్లాన్ ప్రకారం వచ్చారు. చేతిలో నాటు తుపాకీ, ఒక కత్తి పట్టుకుని వచ్చాడు. మొదట ప్రేమ్ చంద్ నేరుగా.. కిచెన్ లోనికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న వంటమనిషిని కత్తితో బెదిరించి, విలువైన వస్తువుల గురించి ఆరాతీశాడు. ఇంటి బయట.. సుశీల్ అనే వ్యక్తి ఎవరైన వస్తారా.. అని కాచుకుని ఉన్నాడు.


అప్పటికే వీరిని గమనించిన.. అమిత, ఆమె కూతురు ఇంటి బైట ఉన్న సుశీల్ పై శివంగుల్లో దూకారు. అంతే కాకుండా అతడిని కింద పడేసి గట్టిగా ప్రతిఘటించి అతని చేతిలో నుంచి నాటు తుపాకీని లాక్కున్నారు. కాసేపు తోపులాట తర్వాత, సుశీల్ పారిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఇంటిలోపలికి వచ్చి చూడగా.. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బయటకు పరిగెత్తుకుంటు వచ్చాడు. ఇతను కూడా కత్తితో బెదిరించడానికి ప్రయత్నంచేశారు.


Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..


కానీ అప్పటికే తల్లికూతుళ్ల అరపులకు, చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి చేరుకున్నారు. ప్రేమ్ చంద్ ను వెంబడించి పట్టుకున్నారు. వీరిద్దరు కూడా గతంలో, వీళ్ల ఇంట్లోనే పనులు చేసినట్లు సమాచారం. ఇంట్లో ఉన్న వస్తువులను, కాస్లీ ఐటమ్స్  లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే చోరీలకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 2.15 నిముషాలకు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చోరీకి సంబంధించిన ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఘటన తర్వాత.. నవరతన్ జైన్, అమిత స్థానిక బేగంపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter