Chain Snatching Gang: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాచకొండ పరిధిలో చైన్ స్నాచర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మహిళలని టార్గెట్ చేసుకొని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వాకింగ్ చేస్తున్న మహిళలు... ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళలు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను తెల్లవారుజామున సమయంలో రెండు గంటలలో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జంట నగరాల్లో ఈ ఘటన ఉలిక్కి పడేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ కేసులో నిందితులకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పక్కా స్కెచ్‌తోనే దొంగలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. హర్యానా బవేరియా గ్యాంగ్ సభ్యులుగా గుర్తించిన పోలీసులు.. ఎంజీబీఎస్ నుంచి బస్సు ఎక్కి పరార్ అయినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన నలుగురు నిందితులు.. ముందుగా ఓ పల్సర్ బైక్, యాక్టివా చోరీ చేశారు. వాటిపై పక్కా స్కెచ్‌తో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. లోకేషన్ ట్రేస్ కాకుండా ఎక్కడా కూడా మొబైల్స్ ఫోన్ వాడలేదు. అదేవిధంగా తమ వెంట ఆయుధాలు కూడా తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.


గతంలో బవేరియా గ్యాంగ్స్‌పై ట్ర్య్ కమిషనరేట్ పరిధిలో 80 స్నాచింగ్స్ కేసులు నమోదయ్యాయి. 2020 హైదరాబాద్‌లో పీడీ యాక్ట్ నమోదు అవ్వగా.. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు మళ్లీ దొంగతనాల బాటపట్టారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లడం సంచలనంగా మారింది. 


ఈ నెల 7న ఉప్పల్‌ పరిధిలోని రాజధాని థియేటర్ ప్రాంతంతో పాటు కల్యాణ్‌పురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, ఓయూలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో నిందితులు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి.. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ దొంగతనాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. 


మరోవైపు హైదరాబాద్‌లో పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను విచారిస్తున్నారు. బంగారపు వస్తువులతో నగరంలోని వృద్ధులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం వేళల్లో మహిళలు ఒంటరిగా బయటకు రావొద్దని చెబుతున్నారు. 


Also Read: Shrihan Beating Video : శ్రీహాన్‌ బెల్టుతో కొట్టుకున్న వీడియో.. చిన్మయి పోస్ట్‌తో వివాదం.. క్లారిటీ ఇచ్చిన సిరి


Also Read: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదన్న వర్మ.. డబ్బు కోసం ఏమైనా నాకుతావని!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook