Shrihan Beating Video : శ్రీహాన్‌ బెల్టుతో కొట్టుకున్న వీడియో.. చిన్మయి పోస్ట్‌తో వివాదం.. క్లారిటీ ఇచ్చిన సిరి

Siri Satires to Chinmayi Sripada చిన్మయి శ్రీపాద తాజాగా వరుస పోస్టులతో రచ్చ చేస్తోంది. శ్రీహాన్ తన కొడుకుని బెదిరిస్తున్నాడని, సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ కొడుకులను బెదిరిస్తున్నారంటూ చిన్మయి కౌంటర్లు వేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2023, 11:42 AM IST
  • శ్రీహాన్‌ కాంట్రవర్సీ వీడియో
  • చిన్మయి పోస్టులతో గందరగోళం
  • క్లారిటీ ఇచ్చిన సిరి, శ్రీహాన్
Shrihan Beating Video : శ్రీహాన్‌ బెల్టుతో కొట్టుకున్న వీడియో.. చిన్మయి పోస్ట్‌తో వివాదం.. క్లారిటీ ఇచ్చిన సిరి

Singer Chinmayi-Shrihan-siri శ్రీహాన్ తన కొడుకుని బెదిరిస్తున్నట్టుగా, బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఓ వీడియో చక్కర్లు కొట్టేసింది. అందులో తన బిడ్డ రిమోట్‌ను విరగ్గొట్టాడని ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తావా? అంటూ శ్రీహాన్ బెదిరిస్తూ తనని తాను బెల్టుతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై సింగర్ చిన్మయి స్పందించింది. చిన్మయి స్పందిస్తూ.. ఇలానే పిల్లలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ సైకోలుగా తయారు చేస్తుంటారు తల్లిదండ్రులు అని విమర్శించింది.

ఇలా చేయడం తప్పు అని, పెద్దయ్యాక పిల్లలు కూడా అలానే బెదిరిస్తుంటారని, బ్లాక్ మెయిల్ చేస్తుంటారని చిన్మయి చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడంతో దాని మీద ఇలాంటి ట్రోలింగ్ జరగడంతో అసలు విషయం చెప్పేశారు సిరి, శ్రీహాన్. అయితే అది తమ బుడ్డోడి ఆడిషన్ కోసం చేసిన ట్రయల్ షూట్ అని సిరి, శ్రీహాన్ క్లారిటీ ఇచ్చారు.

ఏంట్రి రాత్రికి రాత్రి ఇంత జరిగిందా? అయ్య బాబోయ్ ఇది మా చైతూ గాడి ఆడిషన్ వీడియో అండి బాబు.. అదంతా కావాలని చేసింది కాదు అని శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. ఓడియమ్మ.. ఇది మా బుడ్డోడి ఆడిషన్ వీడియో ఇంతలోనే అంత జరిగిపోయిందా?.. ఏదైఏమైనా కూడా మమ్మల్ని లవ్ చేసే వాళ్లకి తెలియాలి కాబట్టి ఇది పోస్ట్ చేస్తున్నా.. అని అసలు విషయాన్ని షేర్ చేసింది సిరి.

ఇక వీరు ఇలా ప్లేట్ తిప్పేయడంతో చిన్మయికి ఏం చేయాలో పాలు పోలేదు. ముందేమో అలా అన్నారు.. ఇప్పుడేమో ఆడిషన్ వీడియో అని అంటున్నారు.. నేను అప్పుడు ఇప్పుడూ ఒకే మాట చెబుతున్నాను.. పిల్లల్ని అలా బ్లాక్ మెయిల్ చేయడం, తల్లిదండ్రులు ఇలా బెదిరించడం మాత్రం తప్పే అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.

Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్

Also Read: Sreemukhi Brother : శ్రీముఖి తమ్ముడి బర్త్ డే పిక్స్.. ముద్దులు పెట్టేసిన రాములమ్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News