CM Revanth Reddy: హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..
Hyderabad: కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు.. ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ప్రజలు పట్టించుకోరని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లోని ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Lb Nagar Stadium Cm Revanth fires On Harish Rao: ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్ల పాటు గత బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దెవా చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోని నాలుగు ఉద్యోగాలు ఉడగొట్టగానే అందరికి ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నాట్లు తెలిపారు.
యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నామన్నారు. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారుని విమర్శించారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటుండు.. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని, అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని గుర్తు చేశారు. అసెంబ్లీలో మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండని ఎద్దెవా చేశారు. దశ బాగుంటే దిశతో పని లేదు.. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలన్నారు.
3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా?.. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరంటూ రేవంత్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు.పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసిందన్నారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని, గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తామన్నారు.
Read More: Aishwarya Lekshmi: అందాల విందు చేసిన ఐశ్వర్య లక్ష్మీ , ఫోటోలు వైరల్
20ఎకరాల్లో ఒకే క్యాంపస్ లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్ లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం.. ఈ మోడల్ ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని తెలిపారు. అంతేకాకుండా.. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను వెంటనే సేకరించాలని ఎల్బీ స్టేడియం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook