హైదరాబాద్ వాసులలో కరోనా వైరస్‌తో పాటు మరో విషయం గుబులురేపుతోంది. కరోనా లాంటి వైరస్‌లకు డాక్లర్ల వద్ద చికిత్స చేసుకోవచ్చు, కానీ ప్రచారం అవుతున్న ఆ ఘటనలు జరిగితే హైదరాబాద్‌ను ఊహించలేమంటూ నగరవాసులలో ఆందోళన మొదలైంది. ఢిల్లీ తరహా మత ఘర్షణలు హైదరాబాద్‌లో జరుగుతాయని ప్రచారం కావడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ (Next Target Hyderabad) అనే మెస్సేజ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఢిల్లీ తర్వాత లక్ష్యం హైదరాబాద్. అక్కడ ముస్లింలపై దాడులు జరగనున్నాయి. ఈ పరిస్థితులు ఎదుర్కొనేందుకు వారు అంతగా సిద్ధంగా లేరని’ ఓ మెస్సేజ్ వాట్సాప్, ఫేస్ బుక్, ఇతర సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ తర్వాతి టార్గెట్ హైదరాబాద్ ముస్లింలంటూ వైరల్ అవుతున్న ఆ మెస్సేజ్‌లు మైనారిటీ వర్గాల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. 


Also Read: తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన అమృత



ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ మెస్సేజ్‌లను గుర్తించాయి. నగర ప్రజల్లో ఘర్షణ వాతావరణం తలెత్తేలా చేసేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హైదరాబాద్‌లో అశాంతియుత వాతావరణాన్ని సృష్టించేందుకు ఘర్షణలు జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలంటూ లేని భయాలను కల్పించే యత్నం జరుగుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.


Also Read: మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్


కాగా, ఈ వైరల్ మెస్సెజ్‌లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఐపీఎస్ అంజనీకుమార్ స్పందించారు. గంగా, జమున, తెహజీబ్ సంస్కృతికి నిలయం హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ మీద మీ ప్రేమను చూపించే సమయం ఇదని ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్‌పై మీ ప్రేమ చూపించండి. ఇలాంటి మెస్సేజ్‌లు ఫార్వర్డ్ చేయవద్దు. కానీ కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వార్తల్ని విశ్వసించవద్దు. ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారి వివరాలు మాకు అందించే చర్యలు తీసుకుంటాం. గంగా, జమున, తెహజీబ్ సంస్కృతికి నిలయంగా ఉండటమే హైదరాబాద్ బలమని’ అంజనీ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఈశాన్య ఢిల్లీలో గత నెలలో జరిగిన అల్లర్లు, ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 53కు చేరుకుంది. ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారితో పాటు పోలీసులు, సామాన్యులు బలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కొన్ని వందల కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..