మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్

మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మారుతీరావు కూతురు అమృతకు భారీ షాక్ తగిలింది.

Last Updated : Mar 9, 2020, 11:34 AM IST
మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్

హైదరాబాద్: ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మిర్యాలగూడ వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నేడు మిర్యాలగూడ హిందూ శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే తండ్రి మృతదేహాన్ని కడసారి చూసుకోవాలని అమృత భావిస్తోంది. తనకు పోలీస్ భద్రత కల్పిస్తే తండ్రి అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు తెలిపింది. ఈ మేరకు పోలీసులను భద్రత కోరింది.

ప్రణయ్ హత్యకేసు: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య 

కూతురు అమృతను తన భర్త మారుతీరావు అంత్యక్రియలకు హాజరుకానిచ్చేదని ఆమె తల్లి గిరిజ స్పష్టం చేశారు. భర్తను కోల్పోయిన దుఖంలో ఉన్న గిరిజ.. కూతురిపై తన ఆవేదనను వెల్లగక్కారు. ఈ విషయంపై మారుతీరావు సోదరుడు శ్రవణ్ కూడా స్పందించారు. తన అన్న అంత్యక్రియలకు అమృతకు హాజరుకానిచ్చేది లేదని, చివరిచూపు చూడటానికి తమకు ఇష్టం లేదన్నారు. మరోవైపు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో మారుతీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.

Read also : తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన అమృత

కాగా, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్య భవన్‌లో రెండు రోజులు బస చేసేందుకు శనివారం దిగిన  మారుతీరావు ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. సూసైడ్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అమ్మ వద్దకు రా అని కూతురు అమృతకు తండ్రి సూసైడ్ నోట్ రాయడాన్ని పలువుర్ని కలచివేస్తుంది. అమృత మాత్రం తండ్రి చనిపోయాడని నిర్ధారణ కాలేదని, తనకు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఆత్మహత్యపై మాట్లాడతానని చెప్పడం ఆగ్రహానికి గురిచేసింది.

మారుతీ రావు సూసైడ్ నోట్‌లో అమృత ప్రస్తావన

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News