Fake Cigarettes in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ సిగరెట్ల దందాను పోలీసులు బట్టబయలు చేశారు. సుల్తాన్ బజార్‌లోని కొన్ని గోదాముల్లో భారీ ఎత్తున నిల్వ చేసిన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పక్కా సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గోదాములపై దాడులు చేశారు. సిగరెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఫేక్ సిగరెట్లు తీవ్ర కలకలం రేపాయి. గతేడాది నవంబర్‌లో ఏపీలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బండిల్స్ కొద్ది నకిలీ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా కేంద్రంగా ఈ దందా నడుస్తోందని.. అక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు సప్లై జరుగుతోందని గుర్తించారు. నాసిరకం పొగాకును కొనుగోలు చేసి ఒరిజినల్ బ్రాండ్లకు డూప్లికేట్‌గా వీటిని తయారుచేస్తున్నట్లు గుర్తించారు. 


అంతేకాదు, పొగాకుతో పాటు రంపపు పొట్టును మిక్స్ చేసి నకిలీ సిగరెట్లలో నింపుతున్నారని తేల్చారు. ఒరిజినల్ బ్రాండ్స్ సిగరెట్స్ తాగితేనే గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడటం చూస్తుంటాం. ఇక ఇలాంటి నకిలీ సిగరెట్లు తాగితే త్వరగా ఆరోగ్యం పాడవడం ఖాయమంటున్నారు. కాబట్టి ధూమపాన ప్రియులు ఇలాంటి నకిలీ సిగరెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


Also Read: Prabhas Thanks CM Jagan: సీఎం జగన్‌కు ప్రభాస్ కృతజ్ఞతలు.. సినిమా టికెట్ల ధరల పెంపుపై హర్షం.. 


Also Read: Indian in Ukraine Army: యుద్ధ సమయంలో ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారత విద్యార్థి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook