Corona Patient Deadbodies | కరోనా మహమ్మారి కష్టాలు తెలంగాణ వాసులను, ముఖ్యంగా భాగ్యనగరం ప్రజలను వెంటాడుతున్నాయి. కరోనాతో చనిపోతే దహన సంస్కారాలు సైతం కొన్ని కుటుంబాలు చేయలేకపోతున్న ఘటనలు చూస్తున్నాం. కుటుంబాలు క్వారంటైన్‌లో ఉండటంతో జాగ్రత్తలు తీసుకుని మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు అంత్యక్రియల తంతు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగుచూసింది. భారత్‌లో రికార్డు కరోనా కేసులు.. ఒక్కరోజులో 613 మరణాలు
 
కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు పూర్తిగా  కాలకుండానే వదిలేస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతూ చనిపోయే.. మృతదేహాలకు ఈఐఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తాత అస్థికల కోసం శ్మశాన వాటికకు వెళ్లిన  ఓ యువకుడు సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటం (Dogs Eating COVID19 Patient Deadbodies) చూసి అవాక్కయ్యాడు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. కరోనాతో చనిపోయినా.. శవాలకు సైతం ప్రశాంతత దొరకడం లేదా, మృతదేహాలు సగం కాలిన తర్వాత ఎలా వదిలేసి వెళ్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతోన్న Chingari App


బాధ్యత ఉండక్కర్లేదా?
కరోనాతో చనిపోయిన వారి డెడ్‌బాడీస్ సగం కాల్చి వదిలేయడం, కుక్కలు తినడంపై శ్మశానవాటిక ఇన్‌ఛార్జి గోపాలకృష్ణను ప్రశ్నించగా.. కోవిడ్ మృతుల దహన కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. సిబ్బందిని అడిగితే.. కరోనా పేషెంట్ల మృతదేహాలు పూర్తిగా కాలే వరకు చూడాల్సిన బాధ్యత శ్మశానవాటిక నిర్వాహకులదేనని చెప్పడం గమనార్హం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!