Hyderabad Gang Rape: హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మరో సంచలనం జరిగింది. ఈ కేసులో నిందితులు ఉన్న ఐదుగురు మైనర్లు కొట్టుకున్నారు. మైనర్లు కావడంతో వాళ్లంతా జువెనైల్ హోమ్ లో ఉన్నారు. అక్కడే నిందితులు గొడల పడ్డారని తెలుస్తోంది. ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఐదుగురు మైనర్లు.కార్పొరేటర్‌ కుమారుడు టార్గెట్‌గా ఇతర నిందితులు దాడి చేశారని సమాచారం. పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగిందని తెలుస్తోంది. నీ వల్లే ఇదంతా జరిగిందని కార్పొరేటర్ కొడుకును ఇతర మైనర్లు నిలదీయంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనతో నిందితులు ఉన్న జువెనైల్ హోమ్ కు  భద్రత పెంచారు పోలీసులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాంగ్ రేప్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ పోలీస్ కస్టడీ ముగిసింది. ఇవాళ అతనిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మిగిలిన నిందితులైన ఐదుగురు మైనర్ల కస్టడీ కొనసాగుతోంది. నిందితుల నుంచి పూర్తి సమచారం రాబడుతున్నారు పోలీసులు. ఆదివారం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఈ సందర్భంగా గ్యాంగ్ రేప్ కు సంబంధించి పోలీసులు కీలక సమాచారం రాబ్టటారు. మైనర్ బాలికపై ఇన్నోవా కారులోనే అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలుస్తోంది. సాదుద్దీన్‌ రెచ్చగొట్టడం వల్లే తాము అత్యాచారం చేశామని మైనర్లు చెబితే.. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకే ముందుగా బాలికను రేప్ చేశాడని సాదుద్దీన్ చెప్పినట్లు తెలుస్తోంది.


అయితే  సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌  తర్వాత మైనర్ బాలికపై మొదటగా లైంగిక దాడి చేసింది ఎంఐఎం కార్పొరేటర్‌ కొడుకని పోలీసులు నిర్ధారించారు. అతని తర్వాత కేసులో ఏ5గా ఉన్న మైనర్ రేప్ చేశారని తేలింది. వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకు తర్వాత మిగిలిన మైనర్లు బాలికను అత్యాచారం చేశారని పోలీసులు గుర్తించారు.


Read also: KCR NEW PARTY: ఉండవల్లికి బీఆర్ఎస్ పార్టీ ఏపీ బాధ్యతలు? పీకే డైరెక్షన్ లో కేసీఆర్ స్కెచ్.


Read also: Liquor Prices: మందుబాబులకు సూపర్ న్యూస్.. భారీగా తగ్గనున్న లిక్కర్ ధరలు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి