Liquor Prices: మందుబాబులకు సూపర్ న్యూస్.. భారీగా తగ్గనున్న లిక్కర్ ధరలు!

Liquor Prices: లిక్కర్ ఇప్పుడు ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రజలతో మద్యం తాగించి ఖజానా నింపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందుకోసం లిక్కర్ పాలసీ పేరుతో  ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా లిక్కర్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Srisailam | Last Updated : Jun 13, 2022, 12:32 PM IST
  • మందుబాబులకు గుడ్ న్యూస్
  • భారీగా తగ్గనున్న లిక్కర్ ధరలు
  • జూలై1 నుంచి పంజాబ్ లో కొత్త పాలసీ
Liquor Prices: మందుబాబులకు సూపర్ న్యూస్.. భారీగా తగ్గనున్న లిక్కర్ ధరలు!

Liquor Prices: లిక్కర్ ఇప్పుడు ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రజలతో మద్యం తాగించి ఖజానా నింపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందుకోసం లిక్కర్ పాలసీ పేరుతో  ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మద్యం రాబడిపైనే ప్రధానంగా ఆదారపడుతున్నాయి. మద్యం సేల్స్ పెరిగేలా ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా లిక్కర్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.
పంజాబ్‌ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొస్తోంది.

2022-23 సంవత్సరానికి సంబంధించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొస్తోంది. జూలై1 అమలులోనికి రానున్న కొత్త మద్యం పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆప్ ప్రభుత్వం. లిక్కర్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే భారీగా మద్యం ధరలు తగ్గనున్నాయి. మద్యం రవాణాకు చెక్ పెట్టడంతో పాటు ప్రజలకు భారం తగ్గించేందుకే కొత్త పాలసీ తీసుకొస్తున్నామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. మద్యం ధరలు తగ్గడం వలన మిగిలే డబ్బులతో నిత్యావసరాలు కొనుగోలు చేయాలని డ్రింకర్లకు సూచించారు ఆప్ ఎమ్మెల్యే గుర్దిత్ సింగ్. మద్యం మానేస్తే చాలా మంచిదని.. మానలేని స్థితిలో ఉంటే తక్కువగా తగడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు.

పంజాబ్ లో ప్రస్తుతం మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో.. పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆ సమస్యకు చెక్ పెట్టడానికే ఆప్ సర్కార్ లిక్కర్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మద్యం ధరలు తగ్గించడంపై మద్యం ప్రియులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త ఎక్సైజ్ పాలసీపై పంజాబ్ లోని లిక్కర్ వ్యాపారులు భగ్గుమంటున్నారు. కొత్త పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Read also: Siddhanth Kapoor: బెంగళూరులో డ్రగ్స్ పార్టీ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడి అరెస్ట్... 

Read also: Gang Rape Case: బాధితురాలి తండ్రితో బేరం.. హోంమంత్రి మనవడిని తప్పించారు! గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News