Greater Hyderabad Elections 2020 - Polling start: హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling begins ) ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లల్లో మంగళవారం ఉదయం 7గంటలకు కోవిడ్ (Covid-19) నిబంధనలతో ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. గ్రేటర్ పరిధిలోని 74,67,256 మంది ఓటర్లు.. తమ ఓటు ద్వారా 1,122 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తేల్చనున్నారు. చాలా ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులు తీరారు. Also Read | GHMC Elections 2020: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ బందోబస్తు..
ఈ మేరకు ఎన్నికల అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో 9,101 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు గ్రేటర్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. మూడు కమిషనరేట్లల్లో దాదాపు 50వేల మందికి పైగా పోలీసులను (Telangana Police) మోహరించారు. బ్యాలెట్ పద్దతిలో జరిగే ఈ ఎన్నికలకు ముందుగానే అధికారులు అవగాహన కల్పించడంతోపాటు ఓటర్ స్లిప్పులను పొందేందుకు ప్రత్యేకంగా యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. 18రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 4న వెలువడనున్నాయి. Also read: 
Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!



 


ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో పోటీ చేస్తుండగా.. బీజేపీ (BJP) 149 డివిజన్లలో, కాంగ్రెస్‌ (Congress) 146 డివిజన్లల్లో, టీడీపీ 106, ఎంఐఎం (MIM) 51 స్థానాల్లో పోటీపడుతున్నాయి. సీపీఐ 17, సీపీఎం 12, అదేవిధంగా పలు పార్టీల నుంచి 76 మంది, స్వతంత్ర అభ్యర్థులు 1415 మంది పోటీపడుతున్నారు. ఈ గ్రేటర్ పోరు కోసం ప్రధాన పార్టీలన్ని తమదైన శైలిలో మాటల తూటాలతో ప్రచారాన్ని నిర్వహించాయి.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook