Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!

Covid-19 Saftey Precautions During GHMC Election Voting | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్నాయి. అయితే కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రారంభం అయిన తరుణంలో, దేశ వ్యప్తంగా కేసుల సంఖ్య పెరిగి, అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 

Last Updated : Nov 30, 2020, 11:43 PM IST
    1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్నాయి.
    2. అయితే కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రారంభం అయిన తరుణంలో, దేశ వ్యప్తంగా కేసుల సంఖ్య పెరిగి, అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
    3. ఎన్నికల కమిషన్ కూడా కోవిడ్-19 గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధం అయింది.
Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!

How To Vote During Coronavirus |  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్నాయి. కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రారంభం అయిన తరుణంలో, దేశ వ్యప్తంగా కేసుల సంఖ్య పెరిగి, అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా కోవిడ్-19 గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధం అయింది.

Also Read | Ballot Voting Process: బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేయడం ఎలా ? పూర్తి వివరాలు చదవండి!

అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికలు (Elections)  జరగనున్న ఈ ప్రత్యేక సమయంలో మీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ పది చిట్కాలు తప్పకుండా పాటించండి.

ముందుగా కనుక్కోండి
మీరు ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ గురించి ముందుగానే వివరాలు తెలుసుకోండి. దాని వల్ల చివరి క్షణంలో ఇబ్బంది పడే అవసరం ఉండదు.

ఎస్సెమ్మెస్ చదవండి
SMS అంటే సోషల్ డిస్టెన్సింగ్ (Social Distancing), మాస్క్, చేతులను శానిటైజ్ చేసుకోండి. ఇవి మిమ్మల్నే కాదు ఇతరులను కూడా సేఫ్‌గా ఉంచుతాయి.

Also Read | GHMC Elections 2020: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు

మధ్యాహ్నానికి ముందే
పోలింగ్ సెంటర్‌లో ఓటింగ్ సమయం మొదలైన తొలి కొద్ది గంటల్లోనే ఓటు వేయడానికి ప్రయత్నించండి. అప్పుడు తక్కువ జనం ఉంటారు. కోవిడ్-19 (Covid-19) ముప్పు తగ్గుతుంది. 

బయట వేచి ఉండండి
పోలింగ్ బూత్ లోపల వేచి ఉండటం కన్నా బయట వేచి ఉండటం వల్ల గాలి ప్రసరణ ఉంటుంది. ఇందులో వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. 

తరచూ శానిటైజ్ చేసుకోండి
మీతో పాటో పోలింగ్ బూత్ వద్దకు శానిటైజర్ తీసుకెళ్లండి. తరచూ శానిటైజ్ చేసుకోండి. గోడలు, హ్యాండిల్స్ నుంచి దూరంగా ఉండండి. ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయండి.

Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!

మాస్క్ ధరించండి
బయటికి వెళ్తన్న సమయంలో తప్పుకుండా మాస్క్ ధరించండి. పోలింగ్ చేస్తున్నప్పుడు కూడా మాస్కు తీయకండి. లీకేజీ లేని మాస్కు ఉండేలా చూసుకోండి.

పెన్ను తీసుకెళ్లండి
మీతో పాటు ఒక బ్లాక్ లేదా బ్లూ ఇంక్ పెన్ను తీసుకెళ్లండి. సంతకం చేయాల్సి ఉన్నప్పుడు ఇతర సమయంలో మీ పెన్ను మాత్రమే వినియోగించండి.

గ్లౌజులు వేసుకోండి
ముందుజాగ్రత్తను మించిన మందు లేదు అంటారు. వైరస్ సంక్రమించకుండా ఉండాలి అంటే గ్లౌజులు ధరించండి. దాన్ని జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

పిల్లలను తీసుకెళ్తున్నారా?
దయచేసి పిల్లలను మాత్రం ఓటింగ్ చేసే సమయంలో తీసుకెళ్లకండి. ఇది ఓటింగ్ వేసే సమయంలో సేఫ్‌గా ఉంటారు. దాంతో పాటు డిస్టర్బెన్స్ ఉండదు.

రిలాక్స్
ఇది ఈవీఎం కాదు కాబట్టి టెన్షన్ పడకండి. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కాబట్టి ప్రశాంతంగా ఓటింగ్‌పైయ ఫోకస్ పెట్టండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News