Fake currency in Hyderabad : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
Two held with fake currency in Hyderabad : సుదర్శన్ సినిమాల్లో ఫేక్ కరెన్సీని సప్లయ్ చేస్తుంటాడు. ప్లాన్ ప్రకారమే అఫ్జల్ గంజ్ లో 2కోట్ల ఫేక్ కరెన్సీని కొన్న సుదర్శన్ వాటిని ఆ మహిళకు ఇచ్చేందుకు వెళ్లి దొరికిపోయాడు.
Hyderabad Golconda police caught two persons on charges of illegal possession of fake Indian currency: రూ.2 కోట్ల విలువైన నకిలీ నోట్లను ఓ మహిళకు అంటగట్టే ప్రయత్నం చేశారు ఇద్దరు కేటుగాళ్లు. వారిద్దరినీ గోల్కొండ పోలీసులు (Golconda police) అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.2 వేలు, రూ.500 ఫేక్ కరెన్సీని (fake currency) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చందానగర్‌కు చెందిన వ్యక్తి టోలిచౌకి టూంబ్స్ రోడ్డులోని రతన్‌దీప్ సూపర్‌మార్కెట్ వద్ద నివాసం ఉండే మహిళ రూ.2 కోట్లు అప్పు అడిగింది. ఆ డబ్బులు (Money) ఇచ్చేందుకు ఇంటికి వస్తున్నామంటూ నిందితులు ఆమెకు తెలిపారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇద్దరు వెళ్లి.. రూ.2వేలు, రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చారు. అయితే నోట్లు (Notes) చూడగానే అవి ఫేక్ నోట్లు (Fake Notes) అని అనుమానం వచ్చిన ఆమె వెంటనే గోల్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కరెన్సీని పరిశీలించారు.. అవి నిజంగానే నకిలీ నోట్లు (Fake Notes) అని తేలింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
అయితే అప్పు అడిగిన మహిళకు నకిలీ కరెన్సీ ఇవ్వాలని ముందే ప్లాన్ చేశాడు నిందితుడు సుదర్శన్. సుదర్శన్ సినిమాల్లో ఫేక్ కరెన్సీని (fake currency) సప్లయ్ చేస్తుంటాడు. ప్లాన్ ప్రకారమే అఫ్జల్ గంజ్ లో (Afzal Ganj) 2కోట్ల ఫేక్ కరెన్సీని కొన్న సుదర్శన్ వాటిని ఆ మహిళకు ఇచ్చేందుకు వెళ్లి దొరికిపోయాడు. ఇక ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా సుదర్శన్ (Sudarshan) గతంలో కూడా నకిలీ కరెన్సీ (fake currency) తరలిస్తూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Nalgonda: నల్గొండలో నిత్యపెళ్లికొడుకు.. ఏకంగా 19 మంది మహిళలను..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook