MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

C elections in telugu states : నవంబర్ 26 వరకు నామినేషన్లను (Nominations) ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ స్థానాలన్నింటికీ డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న (December 14) ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 03:08 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
  • స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల
  • నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ
 MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Election commission released notification for the MLC elections in telugu states : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 

తెలంగాణలో (Telangana) 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వీటన్నింటికీ కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలవ్వనుంది. ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ స్వీకరిస్తారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 26 వరకు నామినేషన్లను (Nominations) ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ స్థానాలన్నింటికీ డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న (December 14) ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

Also Read : Nalgonda: నల్గొండలో నిత్యపెళ్లికొడుకు.. ఏకంగా 19 మంది మహిళలను..

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఒకేసారి ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీలో (Andhra Pradesh) ఇప్పటికే మిగిలిపోయిన మున్సిపాలిటీలతో (Municipalities) పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 

తెలంగాణలోని 9 జిల్లాల్లో 12 స్థానాలకు ఈసీ ఈ..షెడ్యూల్‌ విడుదల చేసింది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి చొప్పున.. ఆదిలాబాద్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 

ఏపీ శాసన మండలిలో (AP Legislative Council) ప్రస్తుతం ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వారిలో 11 మంది సభ్యుల సభ్యత్వ కాల పరిమితి ముగిసింది. వాటిని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నోటిఫికేషన్‌ను (Notification‌) జారీ చేసింది. అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా నుంచి ఆయా పార్టీలకు చెందిన సభ్యుల కాల పరిమితి ముగిసింది.

Also Read : Ravishastri: టీమ్ ఇండియా కోచ్‌గా వైదొలగిన రవిశాస్త్రి, ఐసీసీపై ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News