హైదరాబాద్: కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి వల్ల కాలేజీలు, స్కూళ్లు తెరవడం కుదరక ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే తనకు ఆన్‌లైన్ క్లాసులు (Online Classes) అర్థం కావడం లేదని ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. న్యూ బోయిన్‌పల్లికి చెందిన అశోక్‌కుమార్ అనే ప్లంబర్ కుమారుడు దేవ యశ్వంత్ మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలజేలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాయర్ కావాలన్నది యశ్వంత్ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఇంటర్‌లో హెచ్ఈసీ గ్రూపు ఎంచుకున్నాడు. తాను ఎలాగైనా న్యాయవాదిని అవుతానని స్నేహితులతో ఛాలెంజ్ చేశాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కరోనా వ్యాప్తి వల్ల ఆన్‌లైన్‌లోనే క్లాసులు చెబుతున్నారు. క్లాసులు మునుపటిలా అర్థంకాక పోవడంతో, లాయర్ అవుతానో లేదోనని భవిష్యత్తుపై ఆందోళన పెరిగింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...


ఆదివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చ చూసేసరికి యశ్వంత్ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఆన్‌లైన్ క్లాసులు అర్థం కావడం లేదని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానో లేదోనన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అందాల ‘దేశముదురు’ హన్సిక Photos